తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, ఎల్.బి. స్టేడియం ఆధ్వర్యంలో 2021 జనవరి 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు ‘డాక్టర్స క్రికెట్ టోర్నమెంట్’ జరగనుంది. దీనికి సంబంధిచిన “పోస్టర్ మరియు మ్యాన్ అఫ్ ది టోర్నమెంట్‌కు అందజేయబోయే ఎలక్ట్రిక్ బైక్”ను ఈ రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరియు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో విడుదల చేశారు.
కరోనా వైరస్ సమయంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు అందిస్తున్న సేవలు మరువలేనివి, అందులో ముఖ్యంగా వైద్యానికి సంబందించిన మౌలిక సదుపాయాలు లేని మన దేశంలో డాక్టర్లు అందించిన సేవలు అజరామరం, అందులో భాగంగా తెలంగాన రాష్ట్రంలో కూడా మన వైద్యులు కరోనా మొదలైన నాటి నుండి నేటి వరకు కూడా అవిశ్రాంతంగా సేవలందిస్తూ వినోదానికి ,ఆహ్లాదానికి డాక్టర్లు చాలా దూరమయ్యారు. దీనిని గమనించిన స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ, ఈ 3రోజుల క్రికేట్ టోర్నమెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 12 మెడికల్ కాలేజ్ డాక్టర్స్ జట్టులు పాల్గొననున్నాయి.
ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో టిఎన్జిఓ హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్, కరాటే మాస్టర్స్ రవి, లక్ష్మి, తైక్వాండో గణేష్, సినీ నటుడు రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ యువ సభ్యుడు పబ్బా సాయి, బాక్సర్ నిఖత్ జరీన్ తండ్రి జమీల్, షూటర్ ఈషా సింగ్ తండ్రి సచిన్, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.