స్ధానిక సమరం..వార్ వన్ సైడే:ఎంపీ కవిత

186
mp kavitha

స్ధానిక సంస్థల ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని వార్ వన్ సైడేనని జోస్యం చెప్పారు నిజామాబాద్ ఎంపీ కవిత. బోధన్ నియోజకవర్గం నవీపేట మండలం పొతంగల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేసేందుకు ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ట్రెండ్స్‌ని పరిశీలిస్తే గులాబీ పార్టీదే గెలుపని అర్ధమవుతోందన్నారు.టిఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వంలో అడుగులు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ది, కార్యక్రమాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు.

మే 23 ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకంగా మారబోతుందన్నారు. ఆ దిశగా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు ప్రారంభించారని చెప్పారు. ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలన్నారు. ఎంపీ కవిత టిఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రావు, మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.