కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ కమిట్మెంట్‌తో పనిచేస్తోంది..

131
- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కాదు…ఉద్యమం..గడిచిన ఆరేళ్లలో టీఆర్‌ఎస్ సాధించిన విజయాలను మళ్ళీ నెమరెయ్యాలి అన్నారు ఎంపీ కె కేశవరావు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ.. 150 మందిలో 108కి బిసి-మైనార్టీలకు అవకాశం కల్పించాము. ఎస్టీలకు 2 సీట్లు ఉంటే మూడు ఇచ్చాము. ఎస్సిలకు10 సీట్లు ఉంటే 13మందికి ఇచ్చాము. 150లో 75మహిళలకు ఇవ్వాలి..కానీ 85మందికి అవకాశం కల్పించామని తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ కమిట్మెంట్‌తో పనిచేస్తోంది. హైదరాబాద్‌లో వరద బాధితులకు బీదగొప్ప అనే తేడా లేకుండా 500 కోట్లు పంపిణీ చేసాము. ముంపు భాదితులకు 10వేలు పంపిణీ చేస్తుంటే కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. ఎన్నికల అనంతరం మళ్ళీ 10వేల రూపాయల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. నేను స్వయంగా ప్రభుత్వాల్లో-పార్టీలలో పనిచేశాను. హైదరాబాద్ అభివృద్ధి ఈ ఆరేళ్లలో జరిగినట్టు ఎప్పుడూ జరగలేదని కె కేశవరావు పేర్కొన్నారు.

- Advertisement -