ఈ సారి జీహెచ్‌ఎంసీలో సెంచరీ కొట్టాలి- కేటీఆర్‌

164
ktr
- Advertisement -

నేడు తెలంగాణ భవన్‌లో జీహెచ్‌ఎంసీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ ప్రగతి నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించామని, అన్ని కోణాల్లో పరిశీలించాకే అభ్యర్థులను ఖరారు చేశామని మంత్రి అన్నారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లలో మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారు. 50శాతం సీట్లు బీసీలకు కేటాయించాం. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాం. అగ్రవర్ణాల వారికి కూడా న్యాయం చేశాం. ఎస్సీలకు 10 సీట్లే రిజర్వ్‌ అయినా 13 కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని’ కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘మాటల్లో కాదు..చేతల్లో సామాజిక న్యాయం చూపిన పార్టీ టీఆర్‌ఎస్‌. ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో స్థిరపడిన వారికి 8 సీట్లు కేటాయించాం. తెలంగాణకు బతుకుదెరువుకు వచ్చిన వారంతా మా బిడ్డలే అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో తెలంగాణేతరులకు ఏమవుతుందో అనే తెలంగాణ వచ్చిన కొత్తలో భయాలు ఉండేవి..సీఎం కేసీఆర్‌ వాటినన్నిటిని పటాపంచలు చేసారు. గులాబీ సైనికులు దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో కార్యకర్త 50వేల ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వందల మంది కష్టపడితే ఒక్క నాయకుడు వస్తాడు. అభ్యర్థులు టికెట్‌ రాని నేతలను కలుపుకొని పోవాలి. ఇది అందరి హైదరాబాద్‌..అందరికోసం పనిచేసే ప్రభుత్వం. అభ్యర్థులు రేపే బీఫారాలు సమర్పించాలని’ కేటీఆర్‌ సూచించారు.

అభ్యర్థులకు గర్వం ,అహం పనికి రాదు.పార్టీలో మీతో పోటీ పడ్డ వారి ఇండ్లకు వెళ్లి మొదట వారి ఆశీర్వాదం తీసుకోండి. ఓట్లు లేవని ఎవ్వరినీ లైట్ గా తీసుకోవద్దు..ప్రగతి నివేదికనే మన అభ్యర్థులకు ప్రచారాస్త్రం.ఎం చేశామో చెప్పుకోవాలి.నగరంలో 95 శాతం నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. హైదరాబాద్ కు 2050 వరకు తాగునీటి ఎద్దడి లేకుండా సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో కేశవాపురం రిజర్వాయర్ ను నిర్మిస్తున్నారు..అది త్వరలోనే అందుబాటు లోకి వస్తుంది ..తాగు నీటి కష్టాలు తీర్చిన ప్రభుత్వ శ్రమను ప్రజలకు వివరించాలి.కరెంటు కష్టాలు తీర్చాము..ఆరేళ్లుగా శాంతి భద్రతల సమస్య లేదు..కర్ఫ్యూ లు లేవు ..దమ్మున్న సీఎం ఇక్కడ ఉన్నారు కనుకే పెట్టుబడులు వరద లాగా వస్తున్నాయి.కృష్ణం రాజు అనే తెలిసినాయన యూపీ వెళితే అక్కడి సీఎస్ తెలంగాణకు పెట్టుబడులు ఎలా వస్తున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు..హైదరాబాద్ తెలంగాణకు ఆర్థిక ఇంజిన్ లాంటిది.హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది.రైతులు సహా అందరూ బాగుంటారు.హైదరాబాద్ ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం .ఆరేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించి చెప్పాలి అని కేటీఆర్‌ అభ్యర్థులకు సూచించారు.

కేంద్రం హైదరాబాద్ కు చేసిన ఒక్క పనైనా ఉందా అని ప్రజలను ప్రశ్నించాలి. అభివృద్ధి కావాలా ?అశాంతి కావాలా అని ప్రజలను అడగాలి. రాష్ట్రానికి సంబంధించి ఇది కీలకమైన ఎన్నిక..ఎలాంటి హైదరాబాద్ కావాలో అంతటా చర్చ పెట్టాలి.రొటీన్ ఎన్నికలా దీన్ని కొట్లాడొద్దు..ఇంటింటికి వెళ్ళాలి.కరోనా సమయంలో భరోసా ఇచ్చింది మనం..ప్రతిపక్షాలు ఎక్కడున్నాయి ?.వలస కార్మకులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే..వలస కార్మికుల నుంచి చార్జీల రూపంలో కేంద్రం డబ్బులు వసూలు చేసినా తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సేవలు అందించింది .వరదలు వచ్చినపుడు ప్రజల్లో ఉన్నాం..వరద సాయం చేశాం..కేంద్రం మాత్రం బుడ్డ పైసా ఇవ్వలేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేస్తే 25 వేలు ఇస్తామంటున్నారు.కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా ? అని కేటీఆర్ ఎద్దేవ చేశారు.

ట్రాఫిక్ చలాన్లపై బీజేపీ అధ్యక్షుడు చెబుతున్న మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. గుజరాత్ లో చలాన్లు మీరే కడుతున్నారా ? ధర్నా చేయడానికి భాగ్యలక్ష్మి గుడే దొరికిందా ?..బీజేపీకి హిందూ ముస్లీమ్ గొడవలు కావాలి,ఇండియా,పాకిస్థాన్ చిచ్చు కావాలి. హైదరాబాద్ కు దమ్ముంటే లక్ష కోట్ల ప్యాకేజ్ బీజేపీ తేగలదా ? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పది రోజులు 24 గంటలు కష్ట పడాలి.. 28న ఎల్బి స్టేడియంలో సీఎం సభ ఉంటుంది. ఈ సారి జీహెచ్‌ఎంసీలో సెంచరీ కొట్టాలి అని మంత్రి కేటీఆర్‌ సూచించారు.

- Advertisement -