నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ మరోసారి పసుపు బోర్డుపై అబద్ధాలు ఆడడం మొదలెట్టిండు. నన్ను గెలిపిస్తే నిజామాబాద్‌కు 5 రోజుల్లో పసుపుబోర్డు తెస్తనని బాండు పేపర్ రాసిచ్చి బ్యాండేసిన అర్వింద్‌పై పసుపు రైతులు ఆగ్రహంతో ఉన్నరు.. బాండు బాబు అర్వింద్ వెంటనే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి బోర్డు సాధన కోసం తమతో కలిసి పోరాడాలని నిజామాబాద్ రైతన్నలు వార్నింగ్ ఇచ్చిన్రు..దీంతో మొహం చెల్లక అర్వింద్ పార్లమెంట్ సమావేశాల పేరుతో ఢిల్లీకి పోయి దాక్కున్నడు..అయితే నిజామాబాద్‌లో కనిపిస్తే..ఎక్కడ రైతన్నలు దొరకబట్టుకుని తన గుండుకు పసుపురాసి గాడిద మీద ఊరేగిస్తరో..లేదా పంజాబ్‌లో వ్యవసాయ చట్టాలపై బలుపు మాటలు మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యేను అక్కడి రైతన్నలు బట్టలూడదీసి చితకబాదినట్లు…. తనకు కూడా బడితెపూజ చేస్తరన్న భయంతో అర్వింద్ ఢిల్లీలో దాక్కున్నడని సోషల్ మీడియాలో బీభత్సమైన ట్రోలింగ్ జరుగుతోంది. అయినా ఎన్ని రోజులని దాక్కుంటడు..సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీ ఓడిపోయే స్థితిలో ఉండడంతో ప్రచారం కోసం మళ్లీ తెలంగాణకు రావాల్సి వచ్చింది..రావడం రావడంతోనే నిజామాబాద్ బీజేపీ ఆఫీసుకువచ్చి పసుపు బోర్డు విషయంలో మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెప్పుడు స్టార్ట్ చేసిండు..పసుపు బోర్డు, మద్దతు ధర విషయంలో కేంద్రం స్పష్టతతో ఉందని చెబుతుండు..అవును బాండు బాబు పసుపు బోర్డు తెలంగాణలో పెట్టద్దని మీ కేంద్రం స్పష్టంగా చెప్పింది కదా మళ్లీ సొల్లు కబుర్లు ఎందుకంటూ పసుపు రైతులు గుస్సా అవుతున్నరు.
అవును ఇంతకు తమిళనాడులో పసుపుబోర్డు పెడతమని మేనిఫెస్టోలో పెట్టిన్రు కదా అని అడిగితే అర్వింద్ ఏం చెప్పిండో వినండి… తమిళనాడు రాష్ట్ర ఎన్నికల మ్యానిఫెస్టోలో మాత్రమే పసుపు బోర్డు అంశం ఉంది. కేంద్ర మ్యానిఫెస్టోలో మాత్రం లేదు. జాతీయ స్థాయిలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే అది ఖచ్చితంగా తెలంగాణకే వస్తుంది. అంటూ తలతిక్క జవాబు చెప్పిండు…అంటే ఓట్ల కోసమే మేనిఫెస్టోలో పెడతరా.. కేంద్ర మేనిఫెస్టోలో లేదంటే తమిళనాడులో కూడా బోర్డు పెట్టరనేగా అర్థం.. వార్నీ తెలంగాణ ప్రజలను మోసం చేసి నువ్వు ఎంపీగా గెలిచినవు, అట్నే తమిళనాడులో పసుపుబోర్డు పేరుతో అక్కడి రైతులను దగా చేసి కొన్ని సీట్లు కొట్టేయాలనేగా మీ పార్టీ ప్లాన్ అని అర్వింద్‌పై నిజామాబాద్ రైతులు మండిపడుతున్రు. ఇక పసుపు బోర్డుపై కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని, బోర్డు కంటే మేలైన పథకాలు అమలు చేస్తున్నామని మళ్లీ సొల్లు కబుర్లు చెప్పిండు..అసలు 5 రోజుల్లో బోర్డు తెస్తనని చెప్పి బాండు పేపరు రాసి పసుపు రైతులకు టోకరా ఇచ్చిన అర్వింద్..ఇప్పుడు ఓట్ల కోసమే మేనిఫెస్టోలో పెట్టినం..అంటూ తమ పార్టీ బండారం బయటపెట్టిండు.. వార్నీ అర్వింద్ నువ్వు, నీ పార్టీ ఇంత జూటా చేస్తరా..అన్నా..పసుపు రైతన్నలు…ఓ సారి గుండన్న, బండన్నను గట్టిగా అర్సుకుంటే కాని లాభం లేదు..ముందు సాగర్ ఉప ఎన్నికలలో బీజేపీని ఓడించి బండికి, అర్వింద్‌కు బుద్ధి వచ్చేలా చేయాలి.. సాగర్ రైతన్నల్లారా.. మీరు కూడా అర్వింద్ మీ ప్రాంతానికి ప్రచారానికి వస్తే బోర్డు గురించి మా తరపున నిలదీయండి అంటూ నిజామాబాద్ పసుపు రైతన్నలు కోరుతున్నరు..అర్వింద్‌కు ముందుంది ముసళ్ల పండుగ..బోర్డు తీసుకురాకపోతే నిజామాబాద్ రైతన్నల చేతిలో బడితెపూజ తప్పదు.

