జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు చనిపోవడంపై మరోసారి స్పందించారు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. పుల్వామాలో భారత జవాన్లను పాకిస్ధాన్ అన్యాయంగా చంపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ కు శత్రవులైనవారు ఇక్కడి ముస్లింలందరికి శత్రువులేనన్నానరు. ఇపాకిస్థాన్‌లో చిక్కుకున్న ఫైలెట్ అభినందన్ క్షేమంగా ఇండియాకు తిరిగారావడం పట్ల అసద్ సంతోషం వ్యక్తంచేశారు.
ఈసందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు ఓవైసీ. వైసీపీ అధినేత జగన్ ఆహ్వానిస్తే ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు. చంద్రబాబు కాస్కో.. నేను ఏపీకి వస్తున్నా..జగన్ కు తరపున ప్రచారం చేస్తానని చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు, ఏపీలో వైసీపీకి తమ మద్దతు ఉంటుందని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తప్పకుండా ఓడిపోతారని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
(అభినందన్ వీడియోను పాకిస్ధాన్ ఎలా ఎడిట్ చేసిందో చూడండి) https://goo.gl/nMLTNJ