వెండితెర వెనుక ఎన్నో వ్యథలు

234
- Advertisement -

వెండితెరపై నెంబర్‌వన్‌ పోజిషన్‌ కోసం హీరోయిన్స్‌ చాలా కష్టాలు పడుతుంటారు. దానికి తోడు డైట్‌ను ఖచ్చితంగా పాటిస్తారు. ఆధునిక ఆహరపు ఆలవాట్లలో వచ్చే మార్పులు మరికొంత మందిని ఇంకా బలహీనపడేలా చేస్తుంది. ఎంత బలవర్ధకమైన ఆహారం తీసుకున్న వాళ్లు చేసే పని ముందు ఆహారం దిగదుడుపుడే. లైటింగ్‌, సౌండ్‌, మేకప్‌ కోసం చర్మ వ్యాధుల బారిన పడే మరికొంత మంది హీరోయిన్స్‌.

సినిమా హిట్‌ అయిన ఫ్లాఫ్‌ అయిన కుంగుబాటుకు గురికావడం మరికొంతమంది డ్రగ్స్‌కు ఆలవాటు పడటం వల్ల, సరైన నిద్ర, సమయానికి ఆహారం లేకపోవడం వల్ల శారీరకంగా, డిప్రెషన్‌, డయాబెటిస్ వంటి అరుదైన వ్యాధుల భారినపడతారు. తాజాగా సమంత మయోసైటిస్‌ గురైనట్టు వార్తల్లోకి రావడంతో…సినిమా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడి మేల్కొంది.

గతంలో చాలా మంది హీరోయిన్స్‌ అరుదైన వ్యాధులతో భాదపడినవారు ఉన్నారు. సోనాలిబింద్రె, హంసానందిని, మనిషా కోయిరాలా లాంటి వ్యక్తులు క్యాన్సర్‌తో పోరాడావల్సి వచ్చింది. ఇంకొందరు డిప్రెషన్, మానసిక ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారు. ఇలాంటి లీస్ట్‌ చాలానే ఉన్న అందులో కొంతమంది ఆ వ్యాధుల వల్ల సినిమాలకు దూరమయ్యారు. మరికొందరు సినిమాలు చేస్తూ వాటికి సరిపడా మందులు వాడుకుంటున్నవాళ్లు ఉన్నారు. మరి ఆ హీరోయిన్లు ఎవరు ? వారి అనారోగ్య సమస్యలు ఏమిటో చూద్దాం.

స్నేహ ఉల్లాల్
ఈ హీరోయిన్ సినిమాలు చేసి చాల కాలం అయిపోయింది. మరి ఈమె సినిమాలకు ఎందుకు దూరం అయిందో తెలుసా ? ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ సమస్యతో బాధపడ్డారు. కొన్నాళ్లు ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన స్నేహ ఉల్లాల్ చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు…!!

నయనతార
లేడీ సూపర్ స్టార్ అయిన నయనతార స్టార్ హీరోకి ఉన్న ఇమేజ్ సొంతం. నయన్ కూడా ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. స్కిన్‌ అలర్జీ కారణంగా మేకప్‌ వల్ల తనకు ఎలర్జీ ఏర్పుడుతుందని గతంలో నయన పేర్కొన్నారు. గతంలో ఆమె చేసుకున్న ఓ సర్జరీ కారణంగా ఆమెకు ఈ వ్యాధి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యాధికి నయనతార ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటుంది

సమంత
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఆటో ఇమ్యూన్ కారణంగా మయోసిటీస్ బారిన పడ్డారు. ఇది ఒక కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధికి సమంత చికిత్స తీసుకుంటున్నారు. గతంలో సమంత తన నడుము దగ్గర ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడింది. అందుకే నడుమును ఎక్స్ పోజింగ్ చేయడానికి ఇష్టపడట్లేదు.

దీపికా పదుకునే
దీపికా పదుకొనే చాలా కాలంగా డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇక రణ్‌బీర్ కపూర్ తో లవ్ బ్రేకప్ కారణంగా డిప్రెషన్ కి గురయ్యారు. అయితే రణ్‌వీర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొంతవరకు డిప్రెషన్‌ నుంచి బయటపడిన ఇప్పటికి కుంగుబాటుకు సంబంధించిన చికిత్సలను కంటిన్యూ చేస్తోంది. పరిణీతి చోప్రా అనుష్కశర్మ కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు గురైనవాళ్లే.

ఇలియానా
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా చాలా కాలం బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్‌ తో బాధపడ్డారు.ఇక ఇది ఒక మానసిక వ్యాధి. ఈ డిజార్డర్‌ వచ్చినవారు తమ శరీరం , అందం గురించి బాధపడుతూ ఉంటారు. అంతేకాదు ఇక తాము అందంగా లేమని ఆందోళన చెందుతూ ఉంటారు.

టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా స్టార్‌ హీరో హీరోయిన్స్‌ కూడా అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. షారూఖ్‌ ఖాన్,  అమితాబ్ బచ్చన్‌, సైఫ్‌ అలీ ఖాన్‌ లాంటి స్టార్ల్‌ కూడా అరుదైన వ్యాధుల భారిన పడ్డారు.

సల్మాన్ ఖాన్ కు ట్రైజెమినల్ న్యూరాల్జియా ఉంది. అంటే మొహంలో ఉండే నరాల వల్ల వచ్చే వ్యాధి. ఎక్కువసేపు ఫేస్ లో కదలికలు ఇచ్చినా, మాట్లాడినా, బ్రష్ చేసినా విపరీతమైన నొప్పి మొదలవుతుంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ బసుకి అక్యూట్ లుకేమియా వ్యాధితో బాధపడ్డారు.

సోనమ్ కపూర్ కు టీనేజ్ నుంచే డయాబెటీస్ ఇబ్బంది ఉంది. లీసా రే, మనీషా కొయిరాలా, సోనాలి బెంద్రేలు క్యాన్సర్ తో విజయవంతంగా ఫైట్ చేసి కంబ్యాక్ అయ్యారు. ఏది ఏమైనా ఈ అందాల తారలు వెనుక కన్నీళ్లు సమస్యలు ఉండటం బాధాకరమైన విషయం. ఎంత చిత్ర విచిత్రమైన జబ్బులు ఉన్నాయో.

ఇవి కూడా చదవండి..

మీ అందరికి రుణపడి ఉంటాను!

బాలీవుడ్‌ సింగం.. ఖైదీగా వస్తున్నాడు

థ్రిల్లింగ్‌ యాక్షన్‌తో పఠాన్‌ టీజర్‌ వచ్చేసింది

- Advertisement -