శివ కంఠమనేని, రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం రాఘవరెడ్డి. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో K. S. శంకర్ రావ్, G. రాంబాబు యాదవ్, R. వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.జనవరి 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
లక్కీ అలియాస్ మహాలక్ష్మి (నందితా శ్వేతా) తెలంగాణ అమ్మాయి. అల్లరి పిల్ల. ఆమెను విశాఖలోని కాలేజీలో జాయిన్ చేస్తారు. ఇక అదే కాలేజీలో క్రిమినాలజీ ప్రొఫెసర్ రాఘవ రెడ్డి(శివ కంఠమనేని). తప్పు చేస్తే ఎవరిని సహించడు. ఇక లక్కి చేసే అల్లరి పనులకు ఆమెను పనిష్‌మెంట్ ఇస్తూనే ఉంటాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. అయితే ఈ క్రమంలో లక్కీ కిడ్నాప్‌కు గురవుతుంది. అసలు లక్కీని కిడ్నాప్ చేసింది ఎవరు? రాఘవరెడ్డి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడు? ఈ సందర్భంలో ఆయనకు తెలిసే షాకింగ్ నిజం ఏంటి అనేదే సినిమా కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ హీరో శివ కంఠమనేని నటన, కథలో కొత్తదనం,సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్. ముఖ్యంగా తనదైన నటనతో అదరగొట్టాడు శివ. ఎక్కడా కొత్త హీరో అని కనినించకుండా నటించాడు. డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్‌లో సూపర్బ్ అనిపించాడు. తెరపై శివ సూపర్బ్ అనిపించే పర్ఫామెన్స్ ఇచ్చారు. లక్కీ పాత్రకు న్యాయం చేసింది నందితా శ్వేతా. రాశి సినిమాకు మరింత ప్లస్‌గా మారింది. ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుత నటన కనబర్చింది.మిగితా నటీనటుల్లో పోసాని,అజయ్, ప్రవీణ్, అజయ్ ఘోష్, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేశారు.
Also Read:నెల రోజుల్లోనే ఆరుసార్లు.. ఛలో ఢిల్లీ!
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా బాగుంది. తాను అనుకున్న స్టోరిని తెరకెక్కించడంలో దర్శకుడు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే రెగ్యులర్ యూత్ లవ్ స్టోరిని పక్కనపెట్టి డిఫరెంట్‌గా ట్రై చేశారు. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే కావడంతో ఎక్కడా బోరింగ్ అనిపించదు. కెఎస్ శంకర్ రావ్, జి రాంబాబు యాదవ్, ఆర్ వెంకటేశ్వర్ రావు నిర్మాణ విలువలకు వంక పెట్టలేం.
తీర్పు:
రెగ్యులర్ కథలకు భిన్నంగా దర్శకుడు సంజీవ్ మేగొటి చేసిన ప్రయత్నమే రాఘవరెడ్డి. హీరో శివ కంఠంనేని నటన,ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్లస్ కాగా ఫుల్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎక్కడా నిరాశపర్చదు. మొత్తంగా కథలో దమ్ముంటే చిన్న సినిమా కూడా నిలబడుతుంది అన్నదానికి నిదర్శనం రాఘవరెడ్డి.
విడుదల తేదీ:06/01/2024
రేటింగ్:2.25/5
నటీనటులు:శివ కంఠంనేని, రాశి, నందిత శ్వేత
సంగీతం:సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియో
నిర్మాత: శంకర్ రావ్, రాంబాబు యాదవ్, వెంకటేశ్వర్ రావు,
దర్శకత్వం:సంజీవ్ మేగోటి