తెరపై ఎన్టీఆర్ జీవిత చరిత్ర …

367
Movie On Sr NTR Life History
- Advertisement -

ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్ ఉత్తరాదిలో మద్రాసీలుగా పేరుబడిన తెలుగువారికి ప్రత్యేక అస్ధిత్వాన్ని ఏర్పర్చిన మహానేత. ఇటు నటన.. అటు రాజకీయాలు రెండింటిలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర తెరమీదకు రాబోతుంది.

Movie On Sr NTR Life History

ఈ మేరకు ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు హీరో బాలకృష్ణ ప్రకటించారు. టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ తో కలసి నిమ్మకూరులో పర్యటించిన బాలయ్య ఎన్టీఆర్ పై సినిమా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం, నిమ్మకూరులో నిర్మించిన 30 పడకల ఆసుపత్రికి ప్రారంభోత్సవం చేశారు. ఎన్టీఆర్ ఆశయాల మేరకే చంద్రబాబు పనిచేస్తున్నారని కితాబిచ్చారు. నిమ్మకూరును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా లోకేష్ వ్యాఖ్యానించారు. కులం, మతం పేరిట కొందరు రాజకీయాలు చేస్తున్నారని, వారి కుట్రలను తిప్పికొట్టాలని అన్నారు.

తెలుగు సినీరంగాన్నిదశాబ్దాలపాటు ఏకచ్చత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలకు జీవం పోసి.. అసలు దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అనిపించారు. కేవలం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారం హస్తగతం చేసుకుని దేశ రాజకీయాల్లోనే చరిత్ర సృష్టించారు. .ఎన్టీఆర్ స్ఫూర్తితో ఎందరో యువకులు రాజకీయ రంగ ప్రవేశం చేసి.. రాజకీయ దిగ్గజాలను మట్టికరిపించారు. బడుగు జీవుల సంక్షేమమే పరమావధిగా తపించిన ఎన్టీఆర్ ప్రజల వద్దకే పాలన ఉండేలా చర్యలు చేపట్టారు. పేదల కోసం కిలో బియ్యం రూ.2లకే, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్‌ది.

- Advertisement -