శ‌శిక‌ళ‌కు షాకిచ్చిన సుప్రీం….

209
VK Sasikala Order In Corruption Case
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై నిన్నటి నుంచి తనదైన శైలిలో పావులు కదుపుతున్న శశికళకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టాలి అనే తన కోరికకు దేశ అత్యున్నత న్యాయస్ధానం బ్రేక్‌ వేసింది.  మరో వారం రోజుల్లోగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు పై తుది తీర్పు వెలువరించనున్నట్టు వెల్లడించింది. ఇదే కేసులో శశికళ సహ నిందితురాలిగా ఉంది.

VK Sasikala Order In Corruption Case

జ‌య‌ల‌లిత సీఎంగా ఉన్నప్పుడు శశికళ అక్రమంగా చాలా ఆస్తులు కూడ‌బెట్టారంటూ ఆమె పై సుప్రీంకోర్టులో 1996లో అవినీతి నిరోధ‌క చ‌ట్టం కింద కేసు న‌మోదైంది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు 2014లో జయను దోషిగా పేర్కొంటూ నాలుగేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. ఈ కేసులో స‌హ‌నిందితురాలిగా ఉన్న శ‌శిక‌ళ‌కు కూడా జైలు శిక్ష ప‌డింది. ఈ కేసులో 2015లో కర్నాటక హైకోర్టు జయలలితపై కేసును కొట్టేసి ఆమెకు విముక్తి కల్పించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

VK Sasikala Order In Corruption Case

కాగా ప్రత్యేక కోర్టు తీర్పుతో జయలలిత కొంతకాలం సీఎం పీఠానికి దూరమైనా గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించి మ‌ళ్లీ అధికారం చేప‌ట్టింది. జ‌య మ‌ర‌ణం త‌ర్వాత శ‌శిక‌ళ చాలా వ్యూహాత్మకంగా ఏఐడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ పదవి చేప‌ట్టడంతో పాటు ఇప్పుడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కేసేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వారం రోజుల్లో వెలువడనున్న సుప్రీం తీర్పుతో శశికళ సీఎం కావాలన్న కోరిక తీరుతుందా లేదా అన్నది మిలియన్ల్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

- Advertisement -