Motkupalli:మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాల్సిందే

13
- Advertisement -

మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నర్సింహరావు. హైదరాబాద్ బేగంపేటలోని లీలానగర్‌ తన నివాసంలో దీక్ష చేపట్టిన మోత్కుపల్లి..పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు రెండు సీట్లు ఇవ్వాలన్నారు.

కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు అన్యాయం జరుగుతుందని…దీనికి సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండేసి టికెట్లు కేటాయించారని…కానీ కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు.

మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై మందకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పులేదన్నారు. మా జాతికి జరుగుతున్న అన్యాయాలపై ఆయన సరిగానే మాట్లాడరని… కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగాలని తాను మాట్లాడటం లేదని, తాను పార్టీ మారే ప్రసక్తేలదన్నారు. పార్టీ ఇప్పటికైనా గుర్తించి తప్పును సరిదిద్దుకోవాలన్నారు.

Also Read:వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం..

- Advertisement -