గత ఫ్రిబ్రవరిలో మొదలు పెట్టిన యుద్దం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు అతలాకుతలం చేందుతున్నాయి. దాంతో పాటుగా ఆర్థిక మాంద్యం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులుగా మారుతున్న… ఉక్రేయిన్ రష్యాలు మాత్రం యుద్ధం అపడంలేదు.
యుద్ధం వల్ల ఉక్రేయిన్ లో చదువుకుంటున్న వేలాది మంది భారతీయులు భారత్ కు ఉత్త చేతులతో రావాల్సివచ్చింది. చేతిలో పట్టా లేకుండా ఉక్రేయిన్ తిరిగి వచ్చిన విద్యార్థులకు కేంద్రప్రభుత్వం అండగా ఉంది. కానీ తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతీయులకు ఒక భారీ ఆఫర్ ను ప్రకటించారు.
ఉక్రేయిన్ లో చదువుకుంటున్న భారతీయుల విద్యార్థులకు మాస్కో ఆఫర్‌ను ఇచ్చింది. ఈసందర్భంగా చెన్నైలోని రష్యా రాయబారి ఓలెగ్ ఆవడీవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ వీడిన భారత మెడికల్ విద్యార్థులు రష్యాలో తమ చదువు కొనసాగించవచ్చు. రెండు దేశాల సిలబస్ దాదాపు ఒకేలా ఉంటుంది.
ఉక్రెయిన్‌లో చాలా మంది రష్యా భాష మాట్లాడుతారు కాబట్టి.. భాషా సమస్య కూడా ఉండదు. రష్యాలో వారందరికీ సాదర స్వాగతమంటూ ప్రకటించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడితో అక్కడి భారతీయ విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రభుత్వం అత్యవసర ప్రాతిపదికన అనేక మందిని స్వదేశానికి తరలించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
ఫార్ములా ఈ రేస్..ట్రయల్ రన్‌కు సిద్ధం
చరిత్రలో సులువైన ఛేదన ఇదేనా..భారత్
కంగనా… ఈసారి ఇన్‌స్టాగ్రామ్ వంతు