రివ్యూ : మోసగాళ్లు

1145
- Advertisement -

హీరో మంచు విష్ణు గత కొన్నేళ్లుగా కెరీర్‌లో సరైన హిట్ పడక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హీరో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ‘మోసగాళ్లు’ అనే పాన్‌ఇండియా సినిమాతో బరిలోకి దిగాడు. ‘మోసగాళ్లు’ చిత్రం ఈరోజు విడుదలైంది. విష్ణు ఈ సినిమాకు నిర్మాతగానే కాకుండా రచయితగా కూడా మంచు విష్ణు పనిచేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మోసగాళ్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మోసగాళ్లు’అందుకున్నారా? ఈ సినిమా మంచు విష్ణుని హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? ఈ ‘మోసగాళ్ల’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం.

కథ:

కటిక పేదరికంలో పుట్టిన కవల పిల్లలు, చిన్ననాటి సంఘటనలకు ప్రభావితమై, డబ్బు సంపాదన కోసం లేటెస్ట్ ట్రెండ్‌ ప్రకారం స్కాములు చేసి మరీ కోట్లకు పడగలెత్తిన కథతో మోసగాళ్లు చిత్రం రూపొందింది. అర్జున్‌ (మంచు విష్ణు), అను (కాజల్‌ అగర్వాల్‌) కవలపిల్లలు. చాలీచాలని తండ్రి సంపాదనతో, దానికి తోడు అప్పుల ఊబిలో కూరుకుపోయి, సమస్యల సుడి గుండంలో చిక్కుకున్న కుటుంబం. తండ్రి నేర్పిన నీతినిజాయతీ పాఠాలను నమ్మినా, తండ్రే మోసాలకు గురయ్యాడనే ఆవేదనతో అను, అర్జున్‌ ఇద్దరూ పెద్దయ్యాక, తమ స్నేహితుడు‌ విజయ్‌(నవదీప్‌‌) సహాయంతో అమెరికన్లను టాక్స్‌ ఎరియర్స్ పేరుతో మోసం చేసి, చాలా స్పీడుగా రిచ్‌ అయిపోతారు. అయితే స్కాముల నుంచి సంపాదించిన కోట్లరూపాయలతో జీవితంలో ప్రశాంతంగా జీవితంలో స్థిరపడిపోయి, అడ్డదారులకు స్వస్తి చెప్పేద్దామని అను ఎంత చెప్పినా అర్జున్‌ పెడచెవిన పెడతాడు. ధనవంతుడైన గర్వంతో అక్క చెప్పిన మాటలు చెవికెక్కని అర్జున్‌ స్వంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాడు. ఈలోగా స్కాము ప్రారంభానికి ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన విజయ్‌తో కూడా అర్జున్‌కి వ్యవహారం చెడిపోతుంది. ఈలోగా, ఆఫీసులోనే అర్జున్‌ అక్రమాలకు అమెరికాలో కుటుంబాలు కకావికలమైపోవడాన్ని గమనించిన ఓ ఉద్యోగిని అమెరికన్ అథారిటీస్‌కి అర్జున్‌ అవినీతి గురించి వివరాలను అందజేస్తుంది. లోకల్‌ ఏసీపీ (సునీల్‌ శెట్టి) అమెరికన్‌ అథారిటీస్‌తో చేతులు కలిపి అర్జున్‌ని రెండ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటాడు. అను మాత్రం తమ్ముడు అర్జున్‌ని అతి తక్కువ కాలంలోనే జైలు నుంచి విడిపించి, బయటకు తీసుకొచ్చేస్తుంది. కథ సుఖాంతమే.

ప్లస్ పాయింట్స్‌:

అర్జున్‌ పాత్రలో మంచు విష్ణు ఒదిగిపోయాడు. తెరపై ఇంతవరకూ చూడని విష్ణుని ఈ సినిమాలో చూడొచ్చు. కన్నింగ్‌ ఫెలోగా, సీరియస్‌ లుక్‌లో విష్ణు కనిపిస్తాడు. అను పాత్రలో కాజల్‌ పర్వాలేదనిపించింది. ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. ఎసీపీ కుమార్ భాటియాగా సునీశ్‌ శెట్టి నటన బాగుంది. తన అనుభవాన్ని తెరపై చూడొచ్చు. నవీన్‌ చంద్రా, నవదీప్‌ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. మోసగాళ్ళు ఎంతో ఉత్కంఠభరితంగా ప్రేక్షకులని అకట్టుకోవడంలో సెంట్ పర్స్ంట్‌ మార్కుల్ని స్కోర్‌ చేసిందనే చెప్పాలి.

మైనస్ పాయింట్స్‌:

క‌థ‌ను తెరపై చూపించడంలో చిత్ర దర్శకుడు కాస్త తడబడినట్టు అనిపిస్తోంది. సినిమా ఆరంభంలో అను, అర్జున్‌లనేప‌థ్యాన్ని క్లుప్తంగా చూపించేసి, ప్రేక్షకుడిని అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు జెఫ్రీ గీ చిన్.

సాంకేతిక విభాగం:

సినిమా ఎక్కడా బోర్‌ అన్నది లేకుండా ఎంతో ఆసక్తికరంగా ముందుకు నడిచింది. దానికి తోడు కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌…రెండూ రెండు రకాలుగా ఆడియన్స్‌ని సీన్‌ టు సీన్‌ లాస్ట్‌ సీన్‌ వరకూ లాక్కెళ్ళిపోయాయి. నిజంగానే ఈ టైపాఫ్ టేకింగ్‌, యాంగిల్స్ తెలుగు సినిమా వరకూ కొత్తే అని చెప్పడం ఆతిశయోక్తి కానేకాదు. ప్రతీ సన్నివేశానికి ఓ స్పెషల్‌ రేంజ్‌ ఉంది. ప్రతీ షాటుకీ ఓ పర్సజ్‌, ప్రయోజనం ఉన్నాయి. ప్రతీది కథను ఆడియన్స్‌ దృష్టిలో రక్తి కట్టించడానికి, రాణింపజేయడానికి అదనుగా ఉపయోగపడ్డాయి. ఫస్టాఫ్‌లో కథ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం సన్నివేశాలు రాసుకున్నప్పటికీ, సెకండాఫ్‌ మాత్రం జెట్‌స్పీడులో క్లైమాక్స్‌ వైపుకి పరుగులు పెట్టింది సినిమా. సెకండాఫ్‌ కథను బాగా గేరప్‌ చేయడంతో, క్లైమాక్స్ ధ్రిల్లింగ్‌గా ఉంది. అదీ చాలా నేచురల్‌గా. టెక్నికల్‌గా మాట్లాడాలంటే ఫెంటాస్టిక్‌గా ఉంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

తీర్పు: ప్రెష్‌నెస్‌ కోరుకునే ఆడియన్స్‌ తప్పక చూడాల్పిన సినిమా, చూసి ఎంజాయ్ చేసే సినిమా మోసగాళ్లు.

విడుదల తేదీ: 19/03/2021
రేటింగ్: 3.5
నటీనటులు : మంచు విష్ణు, కాజల్‌
సంగీతం : సామ్‌ సి.ఎస్‌
నిర్మాత : మంచు విష్ణు
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్

- Advertisement -