మోసగాళ్లు….సంక్రాంతి విషెస్

163
manchu vishnu
- Advertisement -

మంచు విష్ణు హీరోగా హాలీవుడ్-ఇండియన్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా వియా మార్ ఎంటర్టైన్మెంట్, ఎ.వి.ఎ. ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై విరానికా మంచు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల విడుదల చేసిన సినిమా టీజ‌ర్ అభిమానులను ఆకట్టుకోగా తాజాగా సంక్రాంతి సంద‌ర్భంగా మూవీ నుండి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటోంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి, నవదీప్‌, నవీన్‌చంద్ర, రుహీసింగ్‌ ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏసీపీ కుమార్‌గా ఐటీ కుంభకోణానికి సంబంధించిన నిందితులను పట్టుకునే పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో సునీల్ శెట్టి కనిపించనున్నారు.

- Advertisement -