- Advertisement -
దేశంలో కరోనా థర్డ్ వేవ్‌పై రోజుకో వార్త వినిపిస్తున్న నేపథ్యంలో స్పందించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆస్పత్రిలో కరోనా రోగులను పరామర్శించిన అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి..: కరోనా థర్డ్ వేవ్‌పై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు.
ప్రజలను అనవసరంగా భయపెట్టొద్దని…200 కోట్ల వ్యాక్సిన్ డోసులు భారత్‌లో తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. భారత్ బయోటెక్‌కు వ్యాక్సిన్ అడ్వాన్స్ కింద రూ.1500 కోట్లు కేటాయించామని…దేశంలో ఆక్సిజన్ కొరతను 15 రోజుల్లోనే అధిగమించామన్నారు.
తెలంగాణలో 46 ఆస్పత్రులకు 1400 వెంటిలేటర్లు ఇచ్చామన్నారు. దీపావళికి 80 కోట్ల మందికి అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం అందించనున్నట్టు కిషన్‌రెడ్డి వెల్లడించారు.
- Advertisement -