మార్నింగ్ వాక్..అనేక రోగాలకు చెక్!

51
- Advertisement -

మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం ఎంతో ముఖ్యమైనది అని ఫిట్ నెస్ నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం చేయడం వల్ల మానసికంగాను శరీరకంగాను శక్తినొందుతామని ఫిట్ నెస్ నిపుణులు చెబుతుంటారు. అయితే వయసు పైబడే కొద్ది వ్యాయామం చేయడానికి కొందరు ఇంట్రెస్ చూపారు. అలాంటి వారు నడక ను ప్రధాన వ్యాయామంగా ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఒక గంట నడక కు కేటాయిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను అధిగమించవచ్చట. నిత్యం వర్క్ హడావిడిలో ఉండే వారు ప్రతిరోజూ ఒక గంట వాకింగ్ చేస్తే.. రోజంతా ఫుల్ యాక్టివ్ గా పని చేసుకుంటారట..

ఇంకా వాకింగ్ చేయడం వల్ల ఒంట్లోని వ్యర్థాలు చెమట రూపంలో బయటకు పోయి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. శరీర భాగాలన్నిటికి సక్రమంగా రక్త ప్రసరణ జరుగుతుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటివి తగ్గిపోతాయి. కాళ్ళకు పటుత్వం పెరుగుతుంది. ఆయాసం, అలసట వంటి వాటిని అధిగమించవచ్చు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ తెలిపిన అద్యయానం ప్రకారం ప్రతిరోజూ వాకింగ్ చేసే వారిలో ఆందోళన, మానసిక ఒత్తిడి వంటివి చాలా వరకు తగ్గాయని రిపోర్ట్ లో తెలిపింది.

ఇంకా ప్రతిరోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం కూడా ఫదిలంగా ఉంటుందట. ఎందుకంటే రాత్రంతా పడుకొని ఉదయాన్ని ఫ్రెష్ గా నిద్ర లేవడం వల్ల ఎండోక్రైన్ గ్రంథులు ఎక్కువ మొత్తంలో విడుదల అవుతాయి. తద్వారా రక్తపోటు పెరగడం, పల్స్ రేట్ పెరగడం జరుగుతుంది. అందువల్ల ఉదయం నిద్ర లేవగానే వాకింగ్ చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉండడంతో పాటు గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే గంటల తరబడి జిమ్ లో గడపలేని వారు, వ్యాయామం చేయడానికి శక్తి చాలని వారు ప్రతిరోజూ నడకనే వ్యయమంగా ఎంచుకోవాలని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read:బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై చంద్రబాబు

- Advertisement -