6 గంటల వరకు కరోనా బాధితులు ఓటేసే అవకాశం..

142
corona
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ప్రశంతంగా కొనసాగుతోంది. సాధారణ ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుండగా, ఆ తర్వాత 6 గంటల వరకు కరోనా బాధితులు ఓటేసే అవకాశం కల్పించనున్నారు. చివరి గంట పోలింగ్ కరోనా బాధితుల కోసం కేటాయించనున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాగా, దుబ్బాకలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 55.52 శాతం ఓట్లు పోలవగా, 3 గంటల సమయానికి 71.10 శాతం పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండడంతో ఓటింగ్ శాతం అంతకంతకు పెరుగుతోంది. పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -