53వేల దాటిన ఆర్థి సహాయం దరఖాస్తులు…

38
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా వెనుకబడిన వర్గాల కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం ఇప్పటి వరకూ 53వేల దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదైనట్టు మంత్రి గంగుల కమాలకర్‌ అన్నారు. సోమవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం, టాడీ టాపర్స్ కార్పోరేషన్ ఛైర్మన్ పల్లె రవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ సంధ్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కులవృత్తులపై అధారపడి జీవించేవారి జీవితాలను మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించిన సంగతి తెలిసిందే. కులవృత్తులకు ఉపయోగపడే ముడిసరుకు పనిముట్లు కొనుగోలు చేసేందుకుగానూ ఎలాంటి బ్యాంకు లింకేజీ లేకుండా తిరిగి చెల్లించే అవసరం లేకుండా రూ. లక్ష సహాయం ప్రభుత్వం అందించనుంది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు పథకానికి సంపూర్ణంగా ఆన్‌లైన్‌ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరినీ ప్రత్యక్షంగా కల‌వాల్సిన అవసరం లేదన్న మంత్రి, ఆదాయ పత్రాలు సైతం 2021 ఏప్రిల్ నుండి జారీ చేసినవి చెల్లుబాటవుతాయన్నారు. జిల్లా కలెక్టర్లు సైతం అవసరార్థుల ఆదాయ‌ సర్టిఫికెట్ల జారీపై ప్రత్యేక శ్రద్ద వహించాలని, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

Also Read: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..

అలాగే రాష్ట్రంలోని 703బీసీ ప్రీమెట్రీక్ పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సీట్లను ఆన్‌లైన్‌ ద్వారానే భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఈమేరకు ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్ https://bchostels.cgg.gov.in సచివాలయంలో నేడు అధికారికంగా లాంచ్ చేసారు. ఈ విద్యా సంవత్సరం నుండే దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆన్‌లైన్ ద్వారా ఆడ్మిషన్‌ ఫామ్ నింపి దరఖాస్తు సమర్పించగానే ఎవరి ప్రమేయం లేకుండా వివరాలు వెరిఫికేషన్‌ చేసుకొని ప్రవేశానికి కల్పించే విధంగా వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు మంత్రి స్పష్టం చేశారు.

Also Read: జోగులాంబ గద్వాలకు సీఎం కేసీఆర్..

- Advertisement -