- Advertisement -
లాన్ డౌన్ నిబంధనలకు మరికొంత సడలించింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ నుండి కొన్ని దుకాణాలను మినహాయింపునిస్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ, చిన్న పట్టణాల్లో షాపులు తెరిచేందుకు అనుమతించింది.
మున్సిపల్ నివాసప్రాంతాల్లో అక్కడక్కడా విడిగా ఉన్న దుకాణాలను 50 శాతం సిబ్బందితో అవసరమైన జాగ్రత్తలు తీసుకొని తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతించింది. అయితే సామాజిక దూరం పాటించడం, ముఖానికి మాస్క్ లు ధరించడం తప్పనిసరని పేర్కొంది కేంద్రం.
అయితే, కరోనా హాట్ స్పాట్ లు, కంటైనర్ జోన్ లలో మాత్రం అన్ని దుకాణాలను మూసి ఉంచాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మున్సిపాలిటీల్లోని మార్కెట్ ప్రదేశాలు, మల్టీబ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ లలోని దుకాణాలు మాత్రం మే 3వతేదీ వరకు మూసివేయాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
- Advertisement -