వంతెన ఘటన…ఎంపీ కుటుంబంలో 12 మంది మృతి

144
mp
- Advertisement -

గుజరాత్‌లోని మచ్చు నదిపై వంతెన కూలిన ఘటనలో ఇప్పటి వరకు 141 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇవాళ ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇక ఈ పెను విషాద ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన 12 మంది ప్రాణాలు కొల్పోయారు.

ఎంపీ మోహన్‌బాయ్ కుండారియా కుటుంబానికి చెందిన 12 మంది చనిపోగా ఇందులో 5గురు చిన్నారులు ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో వంతెనపై 500 మంది వరకు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.

15 సంవత్సరాల పాటు వంతెన నిర్వహణ బాధ్యతలను ఒరేవా కంపెనీ ఇవ్వగా.. ఈ ఏడాదిలోనే మోర్బీ మున్సిపల్‌, కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2037 వరకు చెల్లుబాటులో ఉండగా అధికారుల అనుమతి లేకుండానే వంతెనను పునరుద్ధరించారని మున్సిపల్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి..

నిరాడంబరుడు…గుమ్మడి

మునుగోడు.. మునిగేది ఎవరో?

బండి వాఖ్యలపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

- Advertisement -