మొక్కలు నాటిన త్రిష UC19 విన్నర్‌

33
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ చే ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ జోరుగా సాగుతుంది. ఈ సందర్భంగా అండర్ 19 క్రికెట్ విన్నర్‌ త్రిష గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని సెయింట్. జాన్స్ స్పోర్ట్స్ కోచింగ్‌ ఫౌండేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కోచ్‌ ఆర్‌. శ్రీధర్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా త్రిష మాట్లాడుతూ… ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా 17 కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్పవిషయమన్నారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో మొక్కలను నరకరాదు అని అది చట్టరీత్య నేరమన్నారు. ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు వృక్ష వేదం పుస్తకాన్ని త్రిష, కోచ్ శ్రీధర్‌కు బహుకరించారు.

ఇవి కూడా చదవండి…

శ్రీవారి ఆర్జిత సేవాటికెట్ల విడుదల..

రయ్‌..రయ్‌…డబుల్ డెక్కర్‌

పట్నంకు వచ్చిన డబుల్ డెక్కర్‌ బస్సులు..

- Advertisement -