మొంథా తుపాను ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని..నేడు ఏపీలోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మొంథా తుఫాన్.. రాత్రికి మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. రేపు కోస్తా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు అధికారులు.
ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. గన్నవరం విమానాశ్రయంలో మొంథా తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించగా తుఫాన్ కారణంగా ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానాలు రద్దు చేశారు అధికారులు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు సాగించే సర్వీసులు రద్దు చేసింది ఎయిర్ ఇండియా.
Also Read:ప్రపంచంలోనే మొదటి స్కై స్టేడియం

