జూన్ 4న నైఋతి ఋతుపవనాలు ఎంట్రీ..!

112
- Advertisement -

భారతదేశంలో నైఋతి ఋతుపవనాలు కాస్త ఆలస్యం కానున్నాయని భారత వాతవారణ శాఖ ప్రకటించింది. జూన్ 4వ తేదీన నైఋతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకనన్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా నైఋతి పవనాలు సూమారుగా 80శాతం వర్షపాతంను కురుస్తుంది. గడిచిన 4-5యేళ్ల కాలంలో సకాలంలో ఋతుపవనాలు వచ్చేవి కానీ ఈ సారి కాస్త ఆలస్యంగా కానుంది. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వీపరీతంగా భానుడు భగభగ మండిపోతున్నారు.

Also Read: ఆత్మనిర్భర్‌ భారత్..2,736 దేశీయ రక్షణ ఉత్పత్తులు

సాధారణంగా జూన్ ఒకటో తేదీన కేరళలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి. ఒక వారం రోజులు అటూ ఇటూగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఋతుపవనాలను అంచనా వేసేందుకు ఐఎండీ ఒక ప్రత్యేక మోడల్‌ను అభివృద్ధి చేసింది. ఈ మోడల్ ప్రకారం ఋతుపవనాలు అంచనా ప్లస్ లేదా మైనస్ నాలుగుగా ఉంటుంది. ఇది మొత్తంగా ఆరు విధానాల్లో వర్షాకాల రాకను అంచనా వేస్తుంది. దీన్ని ఆధారంగా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తారు.

Also Read: హస్తినకు కర్ణాటక పాలిటిక్స్

- Advertisement -