స్పెయిన్‌లో మంకీపాక్స్ కలకలం..

25
- Advertisement -

స్పెయిన్‌లో మంకీపాక్స్ విలయతాండవం చేస్తోంది. అత్యధిక కేసులు ఈ దేశంలోనే నమోదవుతుండగా తొలిమంకీపాక్స్ మరణం కూడా నమోదైంది. ఈ మరణం
ఆఫ్రికా బయట, ఐరోపాలో నమోదైన తొలిది కావడం విశేషం.

స్పెయిన్‌లో ఇప్పటివరకు 4298 మందికి మంకీపాక్స్‌ వైరస్‌ వ్యాప్తి చెందగా 120 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పటివరకు 78 దేశాల్లో 18 వేలకుపైగా మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. ఇందులో 70 శాతం కేసులు ఐరోపాలోనే ఉన్నాయి.

- Advertisement -