అంతర్జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించాలి…!

110
monkey
monkey
- Advertisement -

కొవిడ్‌ పూర్తి స్థాయిలో అంతం కాకముందే ప్రపంచ ప్రజలను కలవరానికి గురిచెస్తోంది కొత్త రోగం మంకీపాక్స్. ఇప్పటికే దాదాపు 13వేలకు పైగా కేసులు చేరువయ్యాయి. చాప కింద నీరులా ఈ వ్యాధి విస్తరిస్తోందని….నెమ్మదిస్తోన్న దాఖలాలు లేవని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్చించాల్సి ఉందని పలువురు సూచిస్తున్నారు. ఈ ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వెంటాడుతున్న వేళ మంకీపాక్స్ అనేది మరోక సవాళ్లను విసురుతోంది.

మనదేశంలో కూడా మంకీపాక్స్‌ విస్తరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు కేరళ వాసుల్లో దీనిని గుర్తించారు. దాంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను హెల్త్ స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహించాలని విమానశ్రయాల అధికారులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా మంకీపాక్స్ కట్టడిలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విమానాశ్రయాలు, ఓడరేవులు, ఆరోగ్య అధికారులు, ఆరోగ్య శాఖ రీజనల్‌ డైరక్టర్‌లు హాజరయ్యారని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలో మంకీపాక్స్‌ వ్యాప్తిని కట్టడి చేసేలా అతర్జాతీయ ప్రయాణికులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా చూడాలని సూచించినట్టు పేర్కొంది.

తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని… ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రతలు తీసుకుంటుందన్నారు. నిర్ధారణ పరీక్షలకు గాంధీ ఆసుపత్రి, నోడల్ హాస్పిటల్ గా ఫీవర్ ఆసుపత్రి అందుబాటులో ఉన్నాయన్నారు. మంకీపాక్స్ న‌మోదైన దేశాల నుంచి రాష్ట్రానికి వ‌చ్చే ప్ర‌యాణికులు అనుమానిత ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి ప్రాథమిక ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌న్నారు. సీజనల్ వ్యాధులు, మంకీ పాక్స్, వ్యాక్సినేషన్, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య వివరాలు, సలహాలు కోసం 04024651119, 9030227324 సంపాదించాలని ప్రజలకు సూచించారు.

- Advertisement -