- Advertisement -
ప్రపంచవ్యాప్తంగా మంకీ కేసుల సంఖ్య పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో మంకీపాక్స్ వ్యాపించిందని….16వేల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని అన్నారు. ప్రధానంగా మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించడానికి ఐదు కారణాలు ఉన్నాయని తెలిపారు.
గత నెలలో ప్యానెల్‌ను కలుసుకున్నప్పుడు 47 దేశాల నుండి 3,040 కేసులు నమోదయ్యాయని, ఈ సంఖ్య ఒక్క నెలలోనే ఐదు రెట్లు పెరిగిందని ఢబ్ల్యూహెచ్ఓ చీఫ్ డాక్టర్ ట్రెడోస్ అధనామ్ అన్నారు.
మంకీపాక్స్ ఒకప్పుడు కేవలం ఆఫ్రికాకు మాత్రమే పరిమితం అయ్యేదని…దేశాలు సమన్వయ ప్రతిస్పందనతో వైరస్ వ్యాప్తిని నియంత్రించగలవని WHO చీఫ్ చెప్పారు.
- Advertisement -