మొక్కలు నాటిన ఎమ్మెల్యే రేగా..

58
- Advertisement -

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జోరుగా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. కరకగూడెంలోని భట్టుపల్లిలోని బూర్థారం గ్రామం నందు సువర్ణ గిరి జ్వాల నరసింహస్వామి దేవస్థానం నందు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగ్యస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు ఒక నిజమైన ఛాలెంజ్ అని అన్నారు. మనందరం మొక్కలు నాటడం, పెంచడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం వల్ల నేల తల్లికి అలాగే మన సమాజానికి ఎంతో ఉపయోగకరమని …మనమందరం ఆరోగ్యకరంగా ఉండాలంటే మొక్కలు నాటడం చాలా అవసరమన్నారు. అందరం కూడా మొక్కలు పెంచే బాధ్యతగా తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి ప్రజలలో మంచి అవగాహన కల్పిస్తూ చెట్లు నాటే విధంగా ప్రోత్సహిస్తున్నాన్నారు. ఇంతటి అద్భుతమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్‌ఎస్‌ బీసీల ప్రభుత్వం:హరీశ్‌

కోల్‌కతా…పరీక్ష కోసం గ్రీన్ కారిడార్

మహారాష్ట్రలో బీఆర్ఎస్ రైతు నాయకుడిగా మాణిక్..

- Advertisement -