బీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన తెలంగాణ ఫుడ్స్ ఛైర్మన్ మేడే రాజీవ్ సాగర్ స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో మహిళ శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరీ ఫ్యాక్టరీ ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మేడే రాజీవ్ సాగర్ మాట్లాడుతూ…అంబేద్కర్ జయంతి,125అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని పురస్కరించుకోని ఎంపీ సంతోష్‌కుమార్ విసిరిన మొక్కలు నాటే ఛాలెంజ్ స్వీకరించినట్లు తెలిపారు. సంతోష్ కుమార్ చేపట్టిన మహోద్యమంలో భాగంగా మావంతుగా మొక్కలు నాటి మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు.
వృక్షో రక్షతి రక్షిత: అని పెద్దలు అన్నారని ఇప్పుడు మనం చెట్లను రక్షిస్తేనే రానున్న రోజుల్లో అవి మనల్ని రక్షిస్తాయని తెలిపారు. సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప ఉద్యమంలా దేశవ్యాప్తంగా సాగుతుందని వివరించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…