మొక్కలు నాటిన దివ్యారెడ్డి…

45
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా క్లిమామ్ గోషాల నిర్వహకురాలు ఐకేఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ కో కన్వీనర్ అల్లోల దివ్యారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కోడలు దివ్యారెడ్డి తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు.

Also Read: లీజుకు హైదరాబాద్ ఓఆర్ఆర్..

ఈ సందర్భంగా మాట్లాడుతూ…బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ స్థాపించిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతుగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని కోరారు. అలాగే తన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇంత గొప్ప కార్యక్రమంలో అవకాశం కల్పించిన బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: TTD: తిరుమల అప్‌డేట్

- Advertisement -