Mohanlal:వయనాడ్ సహాయక చర్యల్లో మోహన్ లాల్

10
- Advertisement -

భారీ వర్షాలకు కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయనాడ్‌లోని పలు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో వయనాడ్‌ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ . గౌరవ లెఫ్ట్‌నెంట్ హోదాలో వెళ్లిన ఆయన అక్కడి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

కొజికోడ్ నుంచి వయనాడ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్‌ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. సహాయచర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ అధికారులతో చర్చించిన తరవాత మందక్కైలో పర్యటించారు. మందక్కైతో పాటు పుంచిర్‌మట్టోమ్ ప్రాంతంలోనూ పర్యటించారు.

Also Read:‘డబుల్ ఇస్మార్ట్’ ..ట్రైలర్

- Advertisement -