మరక్కార్…విడుదలకు ముందే రికార్డు బ్రేక్!

134
marakkar
- Advertisement -

మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ భారీ చిత్రం మరక్కార్. అరేబియా సముద్ర సింహం అనేది ఉప శీర్షిక. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేద్దామనుకున్నారు కానీ డిసెంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రియదర్శన్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌ను తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున రిలీజ్ చేస్తోంది.

ఈ మూవీ విడుదలకి ముందే ఓ రికార్డుని క్రియేట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా 100 కోట్ల మార్కుని అందుకుందని మేకర్స్ తెలిపారు. అంతేకాకుండా మోహన్‌లాల్ సైతం 4100 స్క్రీన్స్‌లో 16000 షోస్ విడుదల కానున్నట్లు ట్వీట్‌లో చెప్పాడు. మలయాళంతో పాటు సౌతిండియా సినీ చరిత్రలోనే ఇదో మైలురాయిగా మిగిలిపోనుందని సినీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

కీర్తీ సురేశ్‌, అర్జున్ సర్జా, మంజు వారియర్, సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆంటోని పెరుంబవూర్ ప్రొడ్యూస్ చేశాడు. మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ బాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయనున్నారు మేకర్స్. కాగా, దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత కీర్తీ ఈ సినిమాతో మాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషం.

- Advertisement -