దూసుకుపోతున్న..మన్యంపులి

621
Manyam puli
- Advertisement -

మల్లూవుడ్ లో మెగా హిట్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ మన్యంపులికి తెలుగు నాట కూడా విశేష స్పందన లభిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు  మొదటి షో నుంచే సినీజనాలు నీరాజనాలు పడుతున్నారు. సూపర్ హిట్ టాక్ తో మన్యంపులి విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మన్యంపులిలో చిన్నప్పటి మోహన్ లాల్ గా నటించిన మాస్టర్ అజాస్ థియేటర్స్ లో ప్రేక్షకుల్ని స్వయంగా కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో అజాస్ పర్యటణ కొనసాగింది. వెళ్లిన ప్రతి చోటా అజాస్ కు అభిమానుల నుంచి హై రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఇది ఇలా ఉంటే మళయాలంలో బాహుబలికి మించిన సక్సెస్ ను తెలుగునాట మన్యంపులికి అందించిన ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు ఈ చిత్ర నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి.

Manyam puli

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఓ విజువల్ ట్రీట్ ను టాలీవుడ్ ఆడియెన్స్ కి ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని ఆయన ఆన్నారు. అలానే మోహన్ లాల్ నటన, పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, గోపీ సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ అని, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోందని సింధూరపువ్వు కృష్ణారెడ్డి చెప్పారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా అలరిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్,

Manyam puli

- Advertisement -