ఫిలింనగర్ టెంపుల్‌ని మరింత అభివృద్ధి చేస్తా..

314
MohanBabu Takes Oath As Filmnagar Temple Chairman
- Advertisement -

ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్‌గా డా. మోహన్ బాబు ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ.. దైవ భక్తి, ఆధ్యాత్మిక చింతన మెండుగా ఉన్న మోహన్ బాబు గారు చైర్మన్ గా పదవి చేపట్టడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. “ఉన్నది ఉన్నట్లు సూటిగా మాట్లాడే మోహన్ బాబు గారంటే నాకు చాలా ఇష్టం, ఆయన ముక్కోపి అని అందరూ అనుకుంటారు. మాట కటువుగా ఉన్న ఆయన మనసు వెన్న,” అని అన్నారు.

మోహన్ బాబు మాట్లాడుతూ…”నేను ఎన్నడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. ఎందుకంటే మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు మళ్ళి ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా, పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకలవాటు. కానీ ఆ మహా శివుడు టి.సుబ్బరామి రెడ్డి స్వరూపంలో వచ్చి ఫిలిం నగర్ దైవ సన్నిదానం చైర్మన్ బాధ్యతలు స్వీకరించామన్నాడు. స్వరూపానందేంద్ర స్వామిని నేను, రజినీకాంత్ సుబ్బరామి రెడ్డి ద్వారా ఓ సారి కలవడం జరిగింది. నాతోపాటు సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన అందరికి అభినందనలు. ఆడపడుచులు పూజ చేస్తే మంచిదంటారు. సురేఖ, శ్యామలతో పాటు సభ్యులుగా ఎంపికైన ఆడపడుచులకు నా అభినందనలు. సన్నిదానంలో ఉన్న పద్దెనిమిది దేవాలయంలో కొలువైయున్న దేవుళ్ళ ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

MohanBabu Takes Oath As Filmnagar Temple Chairman

దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచడం మనందరి ప్రథమ కర్తవ్యం. కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దామని కోరుతున్నాను. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే అని ఈ సందర్భంగా చెప్తున్నాను. బ్రాహ్మణోత్తములకు నా హృదయ పూర్వక నమస్కారాలు. ఎవరి పని వారు చేసుకుంటే అన్ని సక్రమంగా నడుస్తాయి, మేము కూడా విద్యాలయాలు అలానే నడుపుతున్నాము. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమయితే నా సొంత డబ్బులు ఖర్చుపెట్టయినా సరే సన్నిదానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నానని స్పష్టంచేశారు మోహన్ బాబు.

మోహన్ బాబు ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సభ్యులుగా ప్రముఖ నటులు గిరి బాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి సతీమణి శ్యామల, మెగా స్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, చాముండేశ్వరి నాథ్, వి. రామ్ ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఫిలిం నగర్ దైవ సన్నిదానం ప్రాంగణంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ శ్రీ టి.సుబ్బరామి రెడ్డి, రాజమండ్రి ఎంపి. మురళి మోహన్ పాల్గొన్నారు.

- Advertisement -