నేను బ్రతికే ఉన్న : ఆది పినిశెట్టి

256
Aadhi Pinisetty refutes accident rumors
- Advertisement -

యాక్టర్ ఆది పినిశెట్టి కి ఆక్సిడెంట్ అయింది కాలు విరిగింది నడవలేని స్థితి లో ఉన్నాడు,డాక్టర్లు సీరియస్ అంటున్నారు అనే వార్త తమిళనాడు లో పుట్టింది. ఈ వార్త వేగంగానే సోషల్ మీడియా ద్వారా తెలుగు రాష్ట్రాలకు పాకింది.దీంతో ఆది పినిశెట్టి కి ఆక్సిడెంట్ అయింది అంటూ వార్త ,కథనాలు ,అసలు ఏమైంది అంటూ ప్రచారం మొదలయింది .చాల మంది నటులు ఆది తండ్రి రవి రాజాకి  ఫోన్ చేసి మరి వివరాలు అడిగారు.దీంతో ఈ వార్తను స్వయంగా ఆది పినిశెట్టియే ఖండించాల్సి వచ్చింది.

నాకు ఆక్సిడెంట్ అయిందనే వార్తలు వస్తున్నాయి .ఈ వార్తల్లో నిజం లేదు .అంతా తప్పు నేను బాగానే ఉన్నాను .షూటింగ్ లతో బిజీగా ఉన్నాను. నా పై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు లవ్ ఆల్ అని  ట్వీట్ చేశారు. అంతేకాకుండా ‘భాగమతి’ సినిమా లో నేను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

- Advertisement -