మలళయాళం సుపర్‌స్టార్ మోహన్‌లాల్ ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి ఫాంలో ఉన్నాడు.ఈ మద్య కాలం వచ్చిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ మూవీ జనత గ్యారేజ్ లో మోహన్‌లాల్ లీడ్ రోల్ చేయడంతో ఆయన సినిమాలకు టాలీవుడ్‌లో మంచి మార్కెట్ వచ్చేసింది.ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.మన్యం పులి,కనుపాప సినిమాలతో తెలుగు తన మార్కెట్‌ని పెంచుకున్నాడు
తెలుగు సినిమా ట్యాలెంట్‌ని మళయాళం ప్రజలకు పరిచయం చేయాలనుకుంటున్నాడు కాబోలు అందుకే వరుసగా టాలీవుడ్ తారలని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు.ఎన్టీఆర్‌ని జనతా గ్యారేజ్‌తో సినిమాతో అక్కడి ప్రేక్షకులకు పరిచయం చేశాడు.మరో హీరో అల్లు శిరీష్‌ని ‘1971’ బెయాండ్ బోర్డర్స్ మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు.ఈ సినిమాతో మెగా హీరో అల్లు శిరీష్‌ను కూడా తీసుకెళ్లాడు.అంతేకాదు మరో ఇద్దరు తెలుగు హీరోల్ని మళయాళం చిత్ర పరిశ్రమకి పట్టుకెళ్లే ప్లాన్‌లో ఉన్నారట మోహన్‌లాల్.
రీసెంట్‌గా హీరోయిన్ రాశి ఖన్నాను బి.ఉన్నికృష్ణన్ మూవీలో రిటైర్డ్ కాప్‌గా చేస్తుందటా. ఈ మూవీలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు.ఈ సినిమాతో రాశి ఖన్నాకి మల్లువుడ్‌లో అరంగేట్రం చిత్రం కానుంది. ఈ మూవీలో మరో సినియర్ హీరో శ్రీకాంత్ కూడా నటిస్తున్నాడు.హీరో శ్రీకాంత్‌కి కూడా మళయళంలో ఇదే తొలి చిత్రం. మరి తెలుగు పరిశ్రమ రుణం తీర్చుకోడానికో లేక తెలుగు తారల ట్యాలెంట్ నచ్చిందో తెలియదు కాని వరుసగా తెలుగు యాక్టర్స్‌ని మళయాళ పరిశ్రమకి పరిచయం చేస్తున్నాడు.తెలుగు మార్కెట్‌లో తన సినిమాలకు అధిక వసూళ్లు పెంచడం కోసం ఇదో ప్లాన్ అని సిని వర్గాల గుసగుసలు.