‘శ్రీకృష్ణ దేవరాయ’లపై క్రిష్ సినిమా…!

390
Krish for Sri Krishna devarayalu
- Advertisement -

టాలీవుడ్‌లో వైవిధ్య దర్శకుడిగా పేరు తెచ్చుకున్న క్రిష్‌ ఇప్పుడు ఒకే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురం లాంటి విభిన్న చిత్రాలను ప్రేక్షకులకు అందించిన క్రిష్‌ … బాలయ్యకు వందో సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణితో మంచి విజయాన్ని అందించాడు. శాతకర్ణి విజయం అందించిన స్పూర్తితో ఇప్పుడు వరుసగా హిస్టారికల్‌ సినిమాల వైపే మొగ్గుచూపుతున్నాడట.

ఈ విషయాన్ని స్వయంగా క్రిషే వెల్లడించాడు. కృష్ణదేవరాయల పరిపాలనా కాలాన్ని ‘స్వర్ణయుగం’గా చెప్పుకుంటారు. అలాంటి ఆయనపై సినిమా చేయడానికి క్రిష్ ఆసక్తిగా ఉన్నట్లు టాక్‌. ఆ తరువాత కూడా ‘గౌతమ బుద్ధుడు’ చరిత్రపై చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నట్లు సమాచారం.  త్వరలోనే ఈ విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం వుంది.

Krish for Sri Krishna devarayalu

శాతకర్ణిగా అలరించిన బాలయ్యతోనే క్రిష్ శ్రీకృష్ణదేవరాయలు చిత్రాన్ని తెరకెక్కించేందుకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడట. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు తెరపై ‘శ్రీకృష్ణదేవరాయలు’ అనగానే, టక్కున గుర్తుకు వచ్చేది ఒక్క బాలకృష్ణ మాత్రమే. ‘ఆదిత్య 369’ సినిమాలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర అలాంటిది. ఆ ఆహార్యం, ఆ రాజసం ఒక్క బాలయ్యకే సొంతం.  అయితే  నందమూరి నటసింహం మరి క్రిష్‌ ప్రపోజల్‌కు  మొగ్గుచూపుతారా  లేదా అన్నది అనేది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -