రాజకీయాల్లో 75 ఏళ్లకై రిటైర్మెంట్!

5
- Advertisement -

ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సింగ్ చేసిన కామెంట్స్ బీజేపీ వర్గాల్లో కలకలం రేపాయి. రాజకీయ నేతలు 75 ఏళ్లకు రిటైర్‌ అవ్వాలని ఆయన చేసిన కామెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించేనవేనని చర్చ జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీకి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి.

నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన.. 75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలని. పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాలి అంటూ గతంలో ఓ సారి మోరోపంత్ పింగ్లీ చేసిన వ్యాఖ్యలను మోహన్‌ భగవత్‌ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.

మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు దాటిన తర్వాత పదవీ విరమణ చేయమని ప్రధాని మోదీ బలవంతం చేశారు. ఇప్పుడు ఆయనకూ అదే నిబంధనను వర్తింపజేస్తారో లేదో చూడాలి అని కౌంటర్ ఇచ్చారు.

 

- Advertisement -