ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కుమారుడు గంట రవిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిన సినిమా జయదేవ్ . జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ,రాజకీయ రంగ ప్రముఖులు పలువురు హాజరై గంట రవిని ఆశీర్వదించారు.
అయితే, ఈ సందర్భంగా నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వులు పూయించాయి. గంటా శ్రీనివాస్ రావు ఆయన కొడుకు రవి డేట్లు చూసుకోమని నాకు చెప్పారని ఇందులో డబుల్ ఆఫర్ ఉందన్నారు. గంటా రవికి జ్వరమొచ్చిన, ఎక్కడికైనా వెళ్లిన డూప్ కింద శ్రీనివాస్ రావు వచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. సెక్స్ సాంగ్స్‌లో ఆయనైతే చక్కగా చేయగలరని అన్నారు. దీంతో గంటాతో సహ సభలో ఉన్నవారంత నవ్వుకున్నారు.
తర్వాత మాట్లాడిన మోహన్ బాబు నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై తనదైన శైలీలో స్పందించారు. కొంపలో నిప్పు పోయడం అంటే నీలాంటి వాడేనన్నారు. ప్రజలు చూస్తున్నారు ఏమి మాట్లాడాలో తెలియదా అన్నారు. సెక్స్ సినిమాలు ఆనందిస్తాననడం ఎంతవరకు కరెక్ట్ అన్నారు. గంటాది ఆకోణం కాదన్నారు. గంటా చాలా మంచి వాడని ఆయన మంచితనం వల్లే ఇంతమంది పెద్దలు ఆయన కొడుకును ఆశీర్వదించడానికి వచ్చారన్నారు. అంతేగాదు ఆయన ప్రజలకు సేవ చేయభట్టే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒక సారి ఎంపీగా గెలిచారని తెలిపారు.