Mohan Babu:విష్ణు-మనోజ్‌ గొడవపై మోహన్ బాబు సీరియస్

44
- Advertisement -

మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంచు మనోజ్ అనుచరుడు సారథిపై దాడి చేశారు మంచు విష్ణు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సీరియస్ అయ్యారు మోహన్ బాబు. మంచు మనోజ్ పోస్ట్ చేసిన వీడియోని డిలీట్ చేయించారు. ఆవేశం అన్నింటికీ అనర్థమని తెలిపారు మోహన్ బాబు. అన్నదమ్ముల మధ్య గొడవలు సాధారణమే అని త్వరలోనే అన్ని సర్ధుకుంటాయని తెలిపారు.

సారధి మంచు కుటుంబానికి చాలా నమ్మిన బంటు. అతను ఎన్నో ఏళ్ల నుండి మంచు కుటుంబం తో అంటి పెట్టుకొని వున్నాడు. మోహన్ బాబు ఎక్కడికి వెళ్లినా సారధి ముందు ఉండి అన్నీ చూసుకునేవాడు. ప్రస్తుతం మంచు మనోజ్ ఫిలిం నగర్ దగ్గర వున్న మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇల్లు మోహన్ బాబు తన కూతురు లక్ష్మి కి ఇచ్చేశారు. ఇటీవల మనోజ్ వివాహంలోనూ అంటిముంటనట్టే ఉన్నారు విష్ణు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -