70 కోట్లతో భక్త కన్నప్ప..!

272
Mohan Babu Directing Manchu Vishnu Movie
- Advertisement -

విలన్ గా చిత్ర రంగ ప్రవేశం చేసి … హీరోగా మారి .. వందలాది చిత్రాలలో తనదైన నటనను కనబర్చి ప్రేక్షకులను అలరించిన హీరో మోహన్ బాబు. విలక్షణ నటుడిగా కలెక్షన్‌ కింగ్‌గా ప్రేక్షకుల మనసులను దోచుకున్న మోహన్ బాబు నిర్మాతగా కొన్ని సినిమాలను సైతం తెరకెక్కించాడు. తాజాగా కలెక్షన్ కింగ్ మెగా ఫోన్ పట్టబోతున్నారట..? స్టార్ట్ యాక్షన్ కెమెరా అంటూ సరికొత్త అవతారం ఎత్తబోతున్నారట. ఇప్పుడు ఇదే ఫిల్మ్‌ నగర్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

ప్రస్తుతం మోహన్ బాబు,మంచువిష్ణు నటించిన గాయత్రి సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. కృష్ణంరాజు కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘భక్త కన్నప్ప’ ఒకటి. ఆయన సొంత బ్యానర్లో .. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, అప్పట్లో ఘనవిజయాన్ని సాధించింది. అదే ‘భక్త కన్నప్ప’ కథను ఈనాటి సాంకేతిక నైపుణ్యంతో రూపొందించనున్నట్టు కొంతకాలం క్రితం మంచు విష్ణు చెప్పాడు. ఆయన కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాకు .. కథను తనికెళ్ల భరణి అందించారు.

Mohan Babu Directing Manchu Vishnu Movie

మిథునం త‌ర‌వాత‌… క‌న్న‌ప్ప క‌థ‌ని వెండి తెర‌కెక్కించాల‌ని భావించారు త‌నికెళ్ల భ‌ర‌ణి. ముందు సునీల్‌ని హీరో అనుకొన్నారు. ఆ త‌ర‌వాత విష్ణు చేతికి చేరింది. ఈ క‌థ‌ని ఇప్పుడు బుర్రా సాయిమాధ‌వ్ చేతిలో పెట్టారు‌. భ‌ర‌ణి రాసిన సంభాష‌ణ‌ల్ని బుర్రా తిర‌గ రాస్తున్నాడ‌ని తెలుస్తోంది. మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు, కంచె, గౌత‌మిపుత్ర లాంటి సినిమాల‌కు ప‌దునైన సంభాష‌ణ‌లు అందించారు బుర్రా. ఆ న‌మ్మ‌కంతోనే.. విష్ణు… బుర్రా చేతికి ఈ క‌థ‌ని అంద‌జేశార‌ని తెలుస్తోంది. దాదాపు 70 కోట్ల ఖర్చుతో ఈ సినిమాను నిర్మించనున్నట్లు విష్ణు తెలిపాడు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారు.

- Advertisement -