‘మహానటి’లో మోహన్‌బాబు పాత్ర..

301
Mohan Babu as SVR in Mahanati
- Advertisement -

అలనాటి అందాల తార సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’ ఇందులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటించారు. సావిత్రి పాత్రలో నటీ కీర్తి సురేష్ నటించగా, సమంతా, విజయ్ దేవరకొండ,మోహన్‌బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్ తదితరులుఈ సినిమాలో నటించారు.

 Mohan Babu as SVR in Mahanati

ఇక ఒక్కక్కరి పాత్రలను పరిచయం చేసే వీడియోలను విడుదల చేస్తూ చిత్రంపై ఆంచనాలను పెంచుకుంటున్నారు చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ఇటీవల ఈ సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గా నటించిన అవసరాల శ్రీనివాస్ పాత్రను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సీనియర్ నటుడు మోహన్‌బాబు పాత్రను విడుదల చేసారు చిత్ర యూనిట్.

ఇందులో ఆయన ఎస్వీ రంగారావు పాత్రకు సంబంధించిన క్యారెక్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాత్రలో మోహన్‌బాబు పాత్రతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -