మోహ‌న్ బాబుతో మెగాస్టార్ వీకెండ్ టూర్..!

206
Mohan Babu and Chiranjeevi
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీబిజీగా ఉన్నారు. అయితే చిరుకి కాస్త సమయం దొరకడంతో వీకెండ్ టూర్ వెళ్లారు. ఇందులో స్పెషల్‌ ఏముంది అనుకుంటున్నారు కదా.. చిరు టూర్‌ వెళ్లింది ఎవరితో తెలిస్తే మీరు షాకౌవుతారు. అది మరెవరో కాదు. త‌న చిర‌కాల స్నేహితుడు మోహ‌న్ బాబుతో మెగాస్టార్ సిక్కిం ట్రిప్ వేశారు. ఈ విష‌యాన్ని మంచు ల‌క్ష్మీ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది.

“ఇద్దరు మాస్ట్రోలు సిక్కింకు శీఘ్ర పర్యటనకు వెళ్ళినప్పుడు.. అదొక ఫైరింగ్‌ న్యూస్‌ అవుతుందని మీకు తెలుసు. చిరంజీవి అంకుల్‌..మీరు మాత్రమే నాన్నను వీకెండ్‌ క్విక్‌ ట్రిప్‌లో సిక్కింకు వెళ్లడానికని ఒప్పించగలిగారు. మిమ్మల్ని చూసి నేను ఈర్ష్య పడుతున్నాను. మీరు కలిసి అద్భుతమైన క్షణాలను గడపటం చాలా ఆనందాన్నిచ్చింది. హృదయం సంతోషంతో నిండిపోయింది. మీరు, పిల్లలు కలిసి ఓ రోజు ఇలాంటి ట్రిప్‌కు వెళదాం” అని అంటూ మంచు లక్ష్మి చిరంజీవి, మోహన్‌బాబు కలిసి ఉన్న ఓ ఫొటోను కూడా షేర్‌ చేశారు.

మెహన్‌బాబు తనయుడు, హీరో మంచు మనోజ్‌ కూడా తన ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ “సిక్కింలో బిల్లా రంగా.. మీలో ఎంత మంది ఈ కాంబినేషన్‌ గురించి ఎదురుచూస్తున్నారు. చిరంజీవిగారిని, నాన్నగారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు మనోజ్‌.

- Advertisement -