రిటైర్మెంట్‌పై షమీ క్లారిటీ!

12
- Advertisement -

టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చారు భారత ఆటగాడు మహ్మద్ షమీ. ఆ త‌రువాత గాయం కార‌ణంగా కొన్నాళ్లు ఆట‌కు దూరం కాగా ఇటీవలె కొలుకున్న టెస్ట్ జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో షమీ రిటైర్మెంట్‌పై పుకార్లు షికార్ చేస్తుండగా క్లారిటీ ఇచ్చాడు షమీ.

ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వ‌న్డే, ఇంగ్లాండ్ తో టీ20 మ్యాచ్ ఆడాడు. ఈ క్ర‌మంలో 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీలో ఆడ‌డ‌మే త‌న ల‌క్ష్యం అని చెబుతున్నాడు. ఇప్ప‌ట్లో రిటైర్ అయ్యే ఉద్దేశ్యం త‌న‌కు లేద‌ని…ఎవ‌రికైనా త‌న‌తో స‌మ‌స్య ఉందా అని ఎదురు ప్ర‌శ్నించాడు. ఆట‌పై త‌న‌కు విసుగు వ‌చ్చే వ‌ర‌కు కొన‌సాగుతాన‌ని చెప్పాడు.

తాను రిటైర్‌మెంట్ తీసుకుంటే ఎవ‌రి జీవితాలు బాగుంటాయో చెప్పాల‌ని …తనకు ఆట‌పై ఎప్పుడు విసుగు వ‌స్తుందో అప్పుడు వీడ్కోలు చెబుతాన‌ని అన్నాడు. తాను ఇప్ప‌టికి కూడా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని చెప్పుకొచ్చా డు. షమీ టీమ్ఇండియా త‌రుపున 64 టెస్టులు, 108 వన్డేలు, 27 వన్డేలు ఆడాడు…అన్ని ఫార్మాట్లలో కలిపి 462 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Also Read:విధులకు ఆలస్యం..తుమ్మల ఆగ్రహం

- Advertisement -