ఈడీ విచారణకు అజారుద్దీన్‌

6
- Advertisement -

ఈడీ విచారణకు హాజరయ్యారు తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ వరింగ్‌ ప్రెసిడెంట్‌, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, మహమ్మద్‌ అజారుద్దీన్‌ . హెచ్‌సీఏలో రూ.20 కోట్ల మోసం వ్యవహారంలో ఇటీవల ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేయగా ఇవాళ హైదరాబాద్‌లోని ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు వచ్చారు.

తనపై వచ్చిన ఆరోపణలన్ని తప్పుడువని.. 2019 నుంచి 2023 వరకు హెచ్‌సీఏలో జరిగిన అక్రమాలపై ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలు ఫిర్యాదులు ఉన్నాయి. వీటికి తోడు ఉప్పల్‌ స్టేడియంలో హెచ్‌సీఏ అక్రమాలపై ఏసీబీ అధికారులు సైతం పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటి ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఆర్‌ నమోదు చేశారు. అజారుద్దీన్‌ పదవీకాలంలో క్రికెట్‌ బాల్స్‌, బకెట్‌ చైర్స్‌, జిమ్‌ పరికరాలకు కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఇదే కేసులో మాజీ క్రికెటర్లు అర్షద్‌ అయూబ్‌, శివలాల్‌ యాదవ్‌ను గత డిసెంబర్‌లో ఈడీ అధికారులు విచారించారు. ఈ సోదాల్లో డాక్యుమెంట్లు, డిజిటల్‌ పరికరాలు, రూ.10,39,000ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:రాష్ట్రానికి రూ.11 వేల కోట్లు ఇవ్వండి: సీఎం రేవంత్

- Advertisement -