- Advertisement -
భారత జట్టులో కీపింగ్ విషయంలో ధోని ప్రత్యామ్నాయం లోకేశ్ రాహుల్ మాత్రమేనని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోగా దీనిపై స్పందించారు మహ్మద్ కైఫ్.
లోకేశ్ కేవలం బ్యాకప్ కీపర్ మాత్రమేనని…అతడిని పూర్తిస్ధాయి కీపర్‌గా పరిగణించాల్సిన అవసరం లేదన్నారు.ఒకవేళ కేఎల్‌ని ప్రధాన కీపర్‌గా ఎంచుకుంటే అతడిపై ఒత్తడి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డాడు కైఫ్. మహేంద్రసింగ్ ధోనీలో ఇంకా చాలా క్రికెట్ మిగిలిఉందని..కీపర్‌గా ధోని ఉండటమే జట్టుకు మంచిదని అన్నాడు.
రెగ్యులర్ కీపర్ గాయపడ్డప్పుడో.. లేక వేరే కారణాల వల్ల అతడు అందుబాటులో లేనప్పుడో మాత్రమే రాహుల్‌తో కీపింగ్ చేయించాలని సూచించాడు కైఫ్.
- Advertisement -