వకీల్ సాబ్‌కు జోడిగా గోవా బ్యూటీ..!

279
pawan
- Advertisement -

పింక్ రీమేక్‌తో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండుసినిమాలను లైన్‌లో పెట్టాడు పవన్.

కరోనా కారణంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడగా రోజుకో వార్త మాత్రం టీటౌన్‌లో చక్కర్లు కొడుతునే ఉంది. ఇప్పటివరకు పవన్‌తో శృతి హాసన్‌ నటిస్తుందనే వార్తలు వెలువడగా తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు తెరమీదకు వచ్చింది.ఈ మేరకు నిర్మాతలు ఇలియానాను సంప్రదించినట్లు సమాచారం.

వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్…క్రిష్ తో పాటు హరీష్‌ శంకర్ దర్శకత్వంలో సినిమాలకు కమిట్ అయ్యాడు.

- Advertisement -