రికార్డులకు వేదికగా మొహాలి టెస్టు..

121
mohali test
- Advertisement -

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే శ్రీలంకను చిత్తుచేసి చిరస్మరణీయ విజయం సాధించింది. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో తిరుగులేని గెలుపు నమోదు చేసి విరాట్ కోహ్లీకి మరచిపోలేని గిఫ్ట్‌ని ఇచ్చారు ఆటగాళ్లు. ఇక మొహాలి టెస్టు పలు రికార్డులకు వేదికగా మారింది.

  1. సారథిగా తొలి టెస్టులో రోహిత్‌ విజయం.. తొలిటెస్టులోనే విజయం సాధించిన రెండో భారత కెప్టెన్ రోహిత్
  2. కోహ్లీకి ఇది 100వ టెస్ట్ మ్యాచ్‌
  3. శ్రీలంకకు 300వ టెస్ట్ మ్యాచ్
  4. శ్రీలంకకు ఇండియాలో ఇది 21వ పరాజయం,విదేశాల్లో ఆ జట్టుకు ఇండియాలోనే అత్యధిక పరాజయాలు నమోదయ్యాయి.
  5. జడేజాకు అత్యధిక వ్యక్తిగత స్కోరు 175, జడేజా ఖాతాలో 5 వేలకు పైగా పరుగులు, 400కు పైగా వికెట్లు
  6. టెస్టుల్లో అశ్విన్‌ 12వ హాఫ్ సెంచరీ
  7. టెస్టుల్లో వికెట్ల విషయంలో కపిల్ దేవ్‌ను దాటిన అశ్విన్ (436)
  8. టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయి చేరుకున్న కోహ్లీ
- Advertisement -