- Advertisement -
హైదరాబాద్‌కు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన మోదీకి కేటీఆర్ హాష్‌ట్యాగ్ మోదీ మస్ట్ ఆన్సర్ అని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చేప్పాలని కుడా ఆడిగారు. ఇక్కడి నుంచి వెళ్లేలోగా సమాధానం చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మరచిపోరన్నారు.
ఈ నేపథ్యంలో మస్ట్ ఆన్సర్ మోదీ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు వందలకొద్ది ప్రశ్నలు అడిగారు. తాజాగా మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం మోదీ మస్ట్ ఆన్సర్ ( #ModiMustAnswer )హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేశారు. “మోదీజీకి నా సూటి ప్రశ్న, భారత రూపాయి పతనమవడానికి కారణం ఏంటి..? బీజేపీకి చెందిన ఉత్త రాకుమారుల దగ్గరైన ఈ ప్రశ్నకు సమాధానం ఉందా..?” అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
- Advertisement -