సీఎం కేసీఆర్..రైతు పక్షపాతి:కేటీఆర్

290
KTR-campaign
- Advertisement -

సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొంపల్లిలోని పీఎన్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ సీఎం కేసీఆర్‌ రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని పేరు మార్చి ప్రధాని నరేంద్రమోడీ.. పీఎం కిసాన్‌ యోజన అమలు చేస్తున్నారని చెప్పారు.

హైదరాబాద్‌లోని చెరువులన్నీ సుందరీకరిస్తామని చెప్పిన కేటీఆర్ మూడు నెలల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ అందుబాటులోకి రాబోతోందన్నారు. మెట్రో రైలు మార్గాన్ని మరింత విస్తరిస్తామని… ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుపక్షపాతిగా నిలవాలనేది సీఎం ఆలోచన అని తెలిపారు. హైదరాబాద్‌లో రెండు రిజర్వాయర్లు చేపడుతున్నామని వెల్లడించారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు.

తెలంగాణ నమూనాను దేశం మొత్తం గమనిస్తోందన్నారు. రైతు బంధు,మిషన్ భగీరథ పథకాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో 4వేల బస్సులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుస్తామని చెప్పారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. ఈ సమావేశంలో మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -