శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. తొలిసారి శ్రీశైలం సందర్శనకు వచ్చారు మోదీ.
మల్లికార్జున స్వామికి పంచామృతాలతో ప్రధాని మోదీ రుద్రాభిషేకం నిర్వహించారు. భ్రమరాంబదేవికి ఖడ్గమాల, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు ప్రధాని. పూజల అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ,శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరాలను తిలకించనున్నారు ప్రధాని.
అంతకముందు ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీకి వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు వేదపండితులు. అలాగే ప్రధాని మోదీ కర్నూలు సభకు సర్వం సిద్ధం అయింది. నన్నూరు వద్ద 400 ఎకరాల్లో ప్రధాని బహిరంగ సభ ఉండనుంది. దాదాపు 3 లక్షల మందితో మోదీ సభకు జన సమీకరణ చేయగా రూ.13,430 కోట్లతో 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. 50 ఎకరాల్లో సభా ప్రాంగణం, 360 ఎకరాల్లో 12 పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
Also Read:సుప్రీం కోర్టులో రేవంత్‌కు బిగ్ షాక్

